రాష్ట్రంలోని పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా : ఎంకే మీనా - MUKESH KUMAR MEENA - MUKESH KUMAR MEENA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 12, 2024, 4:41 PM IST
EC Mukesh Kumar Meena visited Tirupati : ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలు మొదలుకుని, లెక్కింపు కేంద్రాలు, ఈవీఎం గదులు భద్రపరిచే గదులను రాష్ట్ర యంత్రాంగం పరిశీలిస్తోంది. ఈ మేరకు ఈసీ ముఖేశ్ కుమార్ మీనా శుక్రవారం తిరుపతిలో పర్యటించారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా ఉంచిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. తిరుపతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఈవీఎంలు భద్రపరిచే గదులను పరిశీలించారు.
'చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ప్రతి ఓటు విలువైనది, ఓటింగ్లో పాల్గొందాం' నినాదంతో ఉన్న సెల్ఫీ ఫొటో బాక్స్ ని ప్రారంభించారు. అనంతరం 'ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం' అంటూ విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ సమయంలో నకిలీ, గైర్హాజరు ఓటర్ల వివరాలు అన్ని రాజకీయ పార్టీలకు అందజేస్తామన్నారు. నకిలీ ఓటరు కార్డులతో దొంగఓటు వేసేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.