తెలంగాణ

telangana

మెదక్​ చర్చిలో ఘనంగా ఈస్టర్​ వేడుకలు - కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు - Easter Celebration in Medak Church

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 12:47 PM IST

Easter Celebration at Medak Church

Easter Celebration at Medak Church : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్​ చర్చిలో ఉదయం నాలుగు గంటల నుంచి ఈస్టర్​ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహాదేవాలయం ఆనవాయితీ ప్రకారం సిలువను ఊరేగింపుగా తీసుకొచ్చి చర్చిలో ప్రతిష్టించారు. ఏసును స్మరించుకుంటూ ప్రార్థనలు చేశారు. ఈ ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. తెల్లవారుజామున నుంచి కొవ్వొత్తులను వెలిగించి క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. 

ఏసు పునరుత్థానము గుర్తు చేసుకుంటూ భక్తి కీర్తనలు పాడారు. వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావటం వల్ల చర్చి ప్రాంగణమంతా కోలాహలం నెలకొంది. మెదక్​, హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. చర్చి ఆవరణలో ఉన్న సిలువ వద్ద భక్తులు కొవ్వొత్తులు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి ప్రార్థనలు చేశారు. అందరికి దైవ సందేశాన్ని అందించారు. ఏసు క్రీస్తు గొప్పతనం గురించి భక్తులకు చెప్పారు. ప్రత్యేక ప్రార్థనా గీతాలతో చర్చి ప్రాంగణమంతా మారుమోగింది. 

ABOUT THE AUTHOR

...view details