ETV Bharat / state

కేటీఆర్ దిలావర్​పూర్​కు రండి - అక్కడే తేలుద్దాం : మంత్రి సీతక్క సవాల్

ఇథనాల్‌ పరిశ్రమకు అన్ని అనుమతులు కేసీఆర్‌, కేటీఆరే ఇచ్చారన్న మంత్రి సీతక్క - అనుమతులిచ్చే సమయానికి ఇథనాల్‌ కంపెనీ డైరెక్టర్‌గా తలసాని సాయి ఉన్నారని ఆరోపణ

Minister Sethakka Allegations On KTR And Talasani
Minister Sethakka Allegations On KTR And Talasani (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Minister Sethakka Allegations On KTR And Talasani : దిలావర్‌పూర్‌లో ఇథనాల్‌ పరిశ్రమకు అన్ని అనుమతులు కేసీఆర్‌, కేటీఆరే ఇచ్చారని మంత్రి సీతక్క తెలిపారు. అనుమతులిచ్చే సమయానికి ఇథనాల్‌ కంపెనీ డైరెక్టర్‌గా తలసాని సాయి ఉన్నారన్న ఆమె ఆ కంపెనీ మరో డైరెక్టర్‌గా పుట్టా సుధాకర్ కుమారుడు ఉన్నారన్నారు. పుట్టా సుధాకర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వియ్యంకులని సీతక్క వెల్లడించారు. గతంలో గ్రామసభ నిర్వహించకుండానే అనుమతులిచ్చారన్న మంత్రి బీఆర్ఎస్ నాయకులు తప్పు చేసి రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్‌ దిలావర్‌పూర్‌ రావాలన్న సీతక్క కంపెనీకి అనుమతులు ఎవరిచ్చారనేది అక్కడే తేలుస్తామన్నారు.

"ఇథనాల్ కంపెనీకి 2022 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. ఆనాటి బీఆర్ఎస్ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ధర్నాలు చేస్తుంటే దాన్ని నిస్సిగ్గుగా ఎక్స్​లో పోస్టులు పెట్టి మమ్మల్ని(కాంగ్రెస్ ప్రభుత్వాన్ని) బద్నాం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని, అప్పటి సీఎం కేసీఆర్ సంతకాలను అన్నింటిని సమన్వయం చేసి పరిశ్రమకు సంపూర్ణమైన అనుమతులు ఇప్పించింది కేటీఆర్. ఈ పర్మిషన్లు వచ్చే నాటికి ఆ కంపెనీ డైరెక్టర్​గా తలసాని సాయికిరణ్ ఉన్నారు. దాదాపు 10 మంది డైరెక్టర్​లతో ఆ సంస్థ ఉంది. కడప జిల్లాకు చెందిన పుట్టా సుధాకర్ కుమారుడు ఇందులో డైరెక్టర్. పుట్టా సుధాకర్, తలసాని వియ్యంకులు." - సీతక్క, మంత్రి

దిలావర్​పూర్​లో రైతులతో చర్చకు రండి : దిలావర్​ పూర్​లో రైతులతో చర్చకు వస్తారా? అని కేటీఆర్​కు మంత్రి సీతక్క సవాల్ విసిరారు. ఆసెంబ్లీలో కూడా దీనిపై చర్చపెట్టి స్పీకర్ ముందు అన్ని అధారాలు ఉంచి చర్చ ఏర్పాటు చేస్తామని అన్నారు. దిలావర్​పూర్​లో ఇథనాల్ కంపెనీకి అనుమతులు గత ప్రభుత్వంలో ఇచ్చి తమను(కాంగ్రెస్ ప్రభుత్వాన్ని) బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే చిల్లర, కుళ్లు రాజకీయాలు బీఆర్ఎస్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు చేసిందీ మీరే(బీఆర్ఎస్), విధ్వంసం చేసింది మీరే, ప్రజలకు రెచ్చగొట్టేది మీరేనంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.

అన్నదాతల పోరాటం ఫలప్రదం - దిలావర్‌పూర్‌లో అంతా ప్రశాంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.