ETV Bharat / state

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం పాకులాట - నాలుగు నెలల నుంచే లాబీయింగ్

ఎమ్మెల్యే కోటా శాసనమండలి పదవుల కోసం పెరుగుతున్న పోటీ - నాలుగు నెలల ముందు నుంచే ఎమ్మెల్సీ పదవుల కోసం లాబీయింగ్‌

Congress is Focusing on Allotment of MLC in MLA Quota
Congress is Focusing on Allotment of MLC in MLA Quota (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Congress is Focusing on Allotment of MLCs in MLA Quota : రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా మండలి పదవుల కోసం పోటీ పెరుగుతోంది. నాలుగు నెలల ముందు నుంచే ఎమ్మెల్సీ పదవుల కోసం పార్టీలో లాబీయింగ్‌ మొదలైంది. వచ్చే ఏడాది మార్చి 29 నాటికి ఐదు ఎమ్మెల్సీ పదవుల గడువు ముగియనుండడంతో వారి స్థానంలో కొత్తవారిని భర్తీ చేయాల్సి ఉంది. నాలుగు ఎమ్మెల్సీ పదవులు కాంగ్రెస్‌కు దక్కనుండటంతో పార్టీకి విధేయులుగా ఉన్నవారికే అవకాశమిచ్చే దిశలో రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది.

ప్రత్యేక దృష్టి సారించిన నాయకత్వం : రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు చెందిన సత్యవతి రాఠోడ్‌, మహమూద్‌ అలీ, శేరిసుభాష్‌ రెడ్డి, యగ్గే మల్లేష్‌, ఎంఐఎంకు చెందిన మీర్జా రియాజ్‌ ఉల్‌హుస్సేన్‌ల పదవీకాలం వచ్చే మార్చి 29తో ముగియనుంది. మరోవైపు రెండు ఉపాధ్యాయ, గ్రాడ్యుయేషన్‌ ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. అయితే ఆ మూడు పోటీ చేసి గెలవాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే కోటా కింద మాత్రమే నామినేటెడ్ ఎమ్మెల్సీల ఎంపిక జరుగుతుంది. అసెంబ్లీలో బలాబలాల దృష్ట్యా కాంగ్రెస్‌కి- 4, బీఆర్‌ఎఎస్‌కి-1 దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ఎమ్మెల్సీల భర్తీపై రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం ప్రత్యేక దృష్టిసారించింది.

ఎమ్మెల్సీ పదవుల కోసం పార్టీలో ఆశావహుల సంఖ్య భారీగా ఉన్నా, విధేయులకే పదవులు కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడ్డాక అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సీఎం, పీసీసీ హోదాలో ప్రతిపాదన చేసినా పార్టీ హైకమాండ్‌ వద్ద జరిగిన మార్పులు, చేర్పుల్లో ఆయనకు అవకాశం దక్కలేదు.

అవకాశం ఇవ్వమని కోరుతున్నారు : మార్చిలో ఖాళీ అయ్యే పదవుల్లో ఆయనకి అవకాశం లభిస్తుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. మైనార్టీల్లో ఐదారుగురు పోటీ పడుతున్నా సీఎంకు అత్యంత సన్నిహితుడైన ఫయూమ్‌ ఖురేషికి ఇచ్చే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు హరివర్దన్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల టికెట్ల వేళ టికెట్‌ కోల్పోయి, బీసీ సామాజికవర్గానికి టికెట్‌ ఇచ్చి గెలుపుకోసం కృషి చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అవకాశమివ్వాలని కోరుతున్నారు.

ఎమ్మెల్సీ సీట్ల భర్తీపై కాంగ్రెస్ కసరత్తు - తెరపైకి ఆ ఆరుగురి నేతల పేర్లు

ఆ మహిళకు అవకాశం : హుస్నాబాద్‌ నుంచి టికెట్‌ ఆశించి భంగపాటుకు గురైన ప్రవీణ్‌రెడ్డి ఆ తర్వాత ఎంపీగా టికెట్‌ పొందలేక పోయారు. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంకోకటి మహిళకు ఇవ్వాల్సి వస్తే ఓబీసీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితకు ఇచ్చే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. గోషామహల్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ముదిరాజ్‌ సామాజిక వర్గానికి మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. కానీ ఆమె ఓడిపోయిన జాబితాలో ఉండడంతో ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆ స్థానం ఎమ్మెల్సీలపై చర్చ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై కొన్నిరోజులుగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, సీఎం రేవంత్‌రెడ్డి సహా సీనియర్‌ నాయకులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం విధేయులుగా ఉన్నవారికే అవకాశం ఇచ్చే యోచనలో పీసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. కష్టపడి పనిచేన ప్రతిఒక్కరికి న్యాయం చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌గౌడ్‌ భరోసా ఇస్తున్నారు. గ్రాడ్యుయేషన్‌ కోటాకింద ఎంపికైన జీవన్‌రెడ్డి, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ కోటా కింద ఎంపికైన అలుగుబెల్లి నర్సిరెడ్డి, కుర్ర రఘమోత్తమ్‌రెడ్డి పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆ పదవుల భర్తీపై మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సమావేశం కానున్నారు.

ఒకటా? రెండా? - ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై గందరగోళం

ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేదా? - అయితే త్వరపడండి - నేడే లాస్ట్​ డేట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.