ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సంక్రాంతి ఇంకా ఐపోలేదా బొత్స గారూ- కాస్త పండగ మూడ్​ నుంచి బయటకు రండి సారూ! - సంక్రాంతి తర్వాత డిఎస్సీ ప్రకటన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 2:04 PM IST

DYFI Members Fires On YSRCP Govt DSC Delay : సంక్రాంతి పండగ తర్వాత డిఎస్సీ ప్రకటన ఉంటుందన్న బొత్స సత్యనారాయణకు ఇంకా పండగ అవ్వలేదా అంటూ డీవైఎఫ్ఐ నాయకులు ప్రశ్నించారు. జనవరి 26వ తేదీలోగా డీఎస్సీ ప్రకటించకపోతే 27వ తేదీ నుంచి నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీవైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా అదిగో డీఎస్సీ, ఇదిగో ఉద్యోగాలు అంటూ నిరుద్యోగులను నయవంచన చేసిందని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ పై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Unemployed Protest Agains YSRCP Govt : ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే తమ ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులపై నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. తక్షణమే 18 వేల 5 వందల 20 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి తక్షణమే భర్తీ చేయాలని తెలిపారు. సంక్రాంతి తరువాత నోటిఫికేషన్​ ఇస్తామని చెప్పిన అధికారులు పండగ ముగిసి పది రోజులపైనే అయినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

ABOUT THE AUTHOR

...view details