LIVE: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు - రాజరాజేశ్వరి అవతారంలో దుర్గమ్మ దర్శనం - DUSSEHRA SHARAN NAVARATRI LIVE
Published : Oct 12, 2024, 7:07 AM IST
|Updated : Oct 12, 2024, 3:41 PM IST
Dasara Sharan Navaratri Live : అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి దసరా శోభను సంతరించుకుంది. శరన్నవరాత్రి మహోత్సవాల వేళ బెజవాడ భక్తులతో కిటకిటలాడుతోంది. శక్తిపీఠాలలో ఒకటిగా విజయవాడ కనకదుర్గాదేవి ఆలయానికి పేరు. ఈ క్రమంలోనే ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ రాజరాజేశ్వరిదేవి అలంకారంలో అమ్మవారు భక్తులు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై ఇవాళ పూర్ణాహుతితో శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్తి కానున్నాయి. రాజరాజేశ్వరిదేవి అలంకారంలో కొలువైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అదే సమయంలో భవానీ దీక్షాధారుల రాకతో ఇంద్రకీలాద్రీపై భక్తుల తాకిడి పెరిగింది. ఉదయం నుంచి క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోజంతా సాఫీగా దర్శనాలు సాగేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంద్రకీలాద్రి పరిసరాలతో పాటు మొత్తం ఆలయంలో భక్తుల రద్దీని సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిశితంగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ రకాల ఏర్పాట్లు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
Last Updated : Oct 12, 2024, 3:41 PM IST