తెలంగాణ

telangana

ETV Bharat / videos

14 ఏళ్లుగా ఉద్యోగాల భర్తీ కోసం న్యాయ పోరాటం చేస్తున్నాం : డీఎస్సీ 2008 అభ్యర్థులు - DSC 2008 Candidates news

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2024, 3:22 PM IST

DSC 2008 Candidates Problem : డీఎస్సీ 2008 అభ్యర్థుల ఉద్యోగాల భర్తీ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని సీఎంవో కార్యదర్శి మాణిక్ రాజు హామీ ఇచ్చారు. ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి నివాసానికి భారీగా చేరుకున్న అభ్యర్థులు, సీఎంవో కార్యదర్శి మాణిక్ రాజును కలిసి తమకు జరిగిన అన్యాయం గురించి వివరించారు. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పును త్వరగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు 14 ఏళ్లుగా ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నామని తెలిపారు. 

2013 జులై 15న సుప్రీంకోర్టు బీఈడీ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, గత ప్రభుత్వం పట్టించుకోలేదని అభ్యర్థులు ఆరోపించారు. అభ్యర్థుల నుంచి సీఎంవో కార్యదర్శి మాణిక్​రాజు పూర్తి వివరాలు తీసుకున్నారు. "2010లో అమరణ దీక్షకు ఆ సమయంలో రేవంత్​రెడ్డి మద్దతూ తెలిపారు. కాంగ్రెస్​ ప్రభుత్వం పీపుల్స్​ మేనిఫెస్టో ప్రకటించడం బీఎడ్​ అభ్యర్థులకు న్యాయం చేస్తున్నామని ఆనాడు ప్రకటించారు. మా ఫైల్​ను తీసుకుని రెండు రోజులలో రివ్వూ మీటింగ్​ జరుపుతామన్నారు. మా సమస్యను పరిష్కారానికి మాణిక్​రాజు సానుకూలంగా స్పందించినట్లు" డీఎస్సీ 2008 అభ్యర్థి ఉమామహేశ్వర్​ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details