ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తాగునీటి ఇక్కట్లు - గంటల తరబడి పడిగాపులు - కనిగిరిలో నిలిచిపోయిన నీటిని సరఫరా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 1:50 PM IST

Drinking Water Problems in Prakasam District : కనిగిరి పట్టణంతో పాటు నియోజవకర్గంలోని 250 గ్రామాలకు పైగా పైప్​లైన్​ ద్వారా నీటిని సరఫరా చేసే రామతీర్థం జలాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కుళాయిల వద్ద నీటి కోసం బిందెలతో బారులు దీరారు. రామతీర్థం పథకానికి సంబంధించిన విద్యుత్​ తీగలు మరమ్మతులకు గురి కావడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ విషయమై ఆర్​డబ్ల్యూఎస్ (RWS) డీఈ విశ్వనాథరెడ్డిని వివరణ కోరగా విద్యుత్తు సమస్య వల్ల నీటి సరఫరా నిలిచిపోయిందని సమస్య పరిష్కరించి యథావిధిగా నీళ్లు సరఫరా చేస్తామన్నారు.  

Several areas in Prakasam district, Andhra face water scarcity : త్రాగునీరు పూర్తిగా నిలిచిపోవడంతో పట్టణంలోని సాగర్ నీటి సరఫరా కేంద్రం వద్ద ఒక్క కుళాయిలోనే ధారగా నీళ్లు వస్తూ ఉండడంతో ఆ నీటి కోసం స్థానిక ప్రజలు వాటర్ క్యాన్లు, బిందెలతో బారులు తీరారు. కనీసం గంట నుంచి రెండు గంటలపాటు క్యూలో ఉండి తాగునీరు (Drinking Water) నింపుకుంటున్నారు.  వేసవి మొదలు కాకముందే త్రాగునీటి కొరతతో (water scarcity ) అవస్తలు పడక తప్పడం లేదని, రాబోయే వేసవి కాలంలో ఇంకెన్ని కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details