తెలంగాణ

telangana

ETV Bharat / videos

పారిశుద్ధ్య కార్మికురాలిపై వీధి కుక్క దాడి - సీసీ ఫుటేజీ వైరల్ - Dog Attack In Hyderabad - DOG ATTACK IN HYDERABAD

By ETV Bharat Telangana Team

Published : Jul 27, 2024, 8:03 PM IST

Dog attack on Sanitation Worker In Hyderabad : రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోజు ఎక్కడో ఓ చోట దాడులు చేస్తూ ప్రజలు రోడ్డుపైకి రావాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి కృపా కాంప్లెక్స్‌ వద్ద పారిశుద్ధ్య కార్మికురాలు కమలపై వీధి కుక్క దాడి చేసింది. విధులు నిర్వహిస్తుండగా వెనక నుంచి వచ్చిన శునకం ఒక్కసారిగా దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన మహిళను మున్సిపల్‌ సిబ్బంది ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఏ కాలనీలో చూసినా వీధి కుక్కలు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. వాటిపై నియంత్రణ లేకపోవడంతో స్వైర విహారం చేస్తున్నాయి. వ్యాక్సినేషన్ చేయకపోవడం, సరైన ఆహారం లేకపోవడంతో మనుషులపై దాడులకు దిగుతున్నాయి. కుక్కల పెరుగుదలకు తగ్గట్లుగా నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో వాటి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వీధి కుక్కల నియంత్రణకు బల్దియా పశు వైద్య విభాగం ఏటా రూ.10 కోట్లు ఖర్చు చేస్తుంది. అయినప్పటికీ కుక్కల దాడి, నియంత్రణ మాత్రం తగ్గడం లేదు.

ABOUT THE AUTHOR

...view details