ETV Bharat / technology

USB-C పోర్ట్​, యాపిల్ మోడెమ్​, న్యూ డిజైన్​తో 'ఐఫోన్ SE 4'- ధర ఎంత ఉంటుందంటే? - IPHONE SE 4

యాపిల్ ప్రియులకు బిగ్ అప్​టేడ్- త్వరలో ఇండియన్ మార్కెట్లోకి SE మోడల్!

iPhone SE 4
iPhone SE 4 (Photo Credit- IANS)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 2, 2025, 3:17 PM IST

Updated : Jan 2, 2025, 4:21 PM IST

iPhone SE 4: టెక్ దిగ్గజం యాపిల్ మరికొన్ని నెలల్లో 'ఐఫోన్ SE 4' మోడల్​ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లోకి ఇది ఏప్రిల్ నాటికి రానున్నట్లు సమాచారం. దాదాపు మూడేళ్ల తర్వాత కంపెనీ నుంచి ఈ SE మోడల్‌ రానుంది. దీంతో ఇది ఏ ఫీచర్లతో రానుందో తెలుసుకునేందుకు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని ఎక్స్​పెక్టెడ్ ఫీచర్లపై ఇప్పటికే చాలా నివేదికలు సమాచారం అందించాయి. అయితే తాజాగా దీని ఎస్టిమేటెడ్ ప్రైస్ వివరాలు కూడా ఓ నివేదికలో వెల్లడైంది. దీని ప్రకారం చూస్తే ఈ అప్​కమింగ్ 'ఐఫోన్ SE 4' మోడల్ ఊహించినంత ఎక్కువ ఖరీదైనది కాదు.

'ఐఫోన్ SE 4' ఫీచర్లు: నివేదికల ప్రకారం.. ఈసారి SE సిరీస్ డిజైన్‌లో కంపెనీ కొన్ని మార్పులు చేయనుంది. 'ఐఫోన్ SE 4' డిజైన్ 'ఐఫోన్ 14' మాదిరిగానే ఉంటుంది. ఇది 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇది 48MP రియర్ సెన్సార్‌తో 'ఐఫోన్ 15' మాదిరిగానే అదే కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. యాపిల్ దీన్ని A18 చిప్‌తో పాటు 8GB RAMతో తీసుకురానున్నట్లు టెక్ వర్గాల అభిప్రాయం. అంతేకాక ఈ ఐఫోన్ యాపిల్ ఇంటెలిజెన్స్‌కు కూడా సపోర్ట్ చేయనున్నట్లు సమాచారం.

USB-C పోర్ట్​ అవైలబిలిటీ: 'ఐఫోన్ 14', ప్రస్తుత SE సిరీస్‌లో ఛార్జింగ్ కోసం లైట్నింగ్ కనెక్టర్ అందుబాటులో ఉంది. అయితే ఈ కొత్త 'SE 4' మోడల్‌లో మాత్రం ఇది మారుతుంది. ఇప్పుడు 'ఐఫోన్ SE 4'తో సహా అన్ని యాపిల్ డివైజ్​లు USB-C పోర్ట్‌తో రిలీజ్ కానున్నాయి. యూరోపియన్ యూనియన్ నిబంధనలే ఇందుకు ప్రధాన కారణమని అంతా భావిస్తున్నారు. అంతేకాక కంపెనీ వీటితో పాటు తన ఫస్ట్ ఇంటెర్నల్ 5G మోడెమ్‌తో కూడా అందిస్తుంది. ఇది Wi-Fi, బ్లూటూత్ అండ్ GPSకి సపోర్ట్ చేస్తుంది.

'ఐఫోన్ SE 4' ధర ఎంత ఉండొచ్చు?: ఈ అప్​కమింగ్ 'ఐఫోన్ SE 4' ధర 500 US డాలర్లు (దాదాపు రూ. 43,000) వరకు ఉండొచ్చని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఐఫోన్ 2022లో విడుదలైన 'ఐఫోన్ SE 3' కంటే దాదాపు రూ.6,000 ఖరీదైనది. భారత మార్కెట్లో 'ఐఫోన్ SE 3' ధర రూ.50,000 నుంచి ప్రారంభమవుతుందని సమాచారం.

దీని పేరు మారే అవకాశం ఉందా?: కొన్ని నివేదికలు కంపెనీ 'ఐఫోన్ SE 4' పేరును 'ఐఫోన్ 16' కి మార్చే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. దీని SE ట్యాగ్‌ను తీసివేస్తే.. ఈ 'ఐఫోన్ 16' సిరీస్​లోకి చేరుతుంది.

ధర తక్కువ- బెనిఫిట్స్ ఎక్కువ: BSNL నుంచి మరో రెండు చౌకైన ప్లాన్లు- డైలీ 3GB డేటాతో పాటు మరెన్నో!

ఈ న్యూ ఇయర్​లో మంచి స్మార్ట్​ఫోన్ కొనాలా? అయితే కాస్త ఆగండి.. త్వరలో కొత్త మోడల్స్ ఎంట్రీ!

నో సబ్​స్క్రిప్షన్: 'యాపిల్ TV+'లో ఫ్రీ స్ట్రీమింగ్- న్యూఇయర్ ఆఫర్ అదిరిందిగా!

Last Updated : Jan 2, 2025, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.