తెలంగాణ

telangana

ETV Bharat / videos

కూకట్‌పల్లిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం - rare surgery in Kukatpally - RARE SURGERY IN KUKATPALLY

By ETV Bharat Telangana Team

Published : Apr 12, 2024, 7:26 PM IST

Rare Surgery in Kukatpally : పుట్టుకతోనే ఊపిరితిత్తుల లోపంతో ఇబ్బంది పడుతున్న బాలుడికి, కూకట్​పల్లిలోని అమోర్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. దాదాపు 9 గంటల పాటు శాస్త్ర చికిత్స నిర్వహించి, అవయవ లోపాన్ని సరిచేశారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, వైద్యులు పలు వివరాలను వెల్లడించారు. 

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలుడికి, ఛాతి కుడి వైపున వైకల్యంతో లోపలికి ఉంది. దీనితో ఊపిరితిత్తులు కూడా లోపలికి నొక్కబడినట్లుగా ఉండడంతో, ఊపిరి తీసుకునే సమయంలో, భోజనం చేసే సమయంలో తీవ్రమైన ఆయాసం పడుతుండేవాడు. అంతేకాకుండా ఇటీవల ఊపిరితిత్తులకు పక్కటెముకలు తగలడంతో తరచూ సమస్య వస్తోంది. ఈ క్రమంలో పలు ఆసుపత్రులలో చికిత్స తీసుకున్న అనంతరం, బాలుని కుటుంబ సభ్యులు కూకట్‌పల్లి అమోర్ ఆసుపత్రిని సంప్రదించారు. ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించి, బాలుడికి ఉపశమనం కలిగించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా, ఆరోగ్యంగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details