LIVE : శాసనసభలో బడ్జెట్ పద్దులపై వాడివేడి చర్చ - Telangana Assembly Live - TELANGANA ASSEMBLY LIVE
Published : Jul 29, 2024, 10:09 AM IST
|Updated : Jul 29, 2024, 4:35 PM IST
Telangana Assembly Budget Session 2024 Live : తెలంగాణ అసెంబ్లీ ఒక్క రోజు విరామం తర్వాత నేడు తిరిగి ప్రారంభమైంది. ఇవాళ కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేసి బడ్జెట్ పద్దులపై చర్చిస్తున్నారు. ఇవాళ మొత్తం 19 పద్ధులపై శాసనసభలో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో పాటు పలువురు మంత్రులు ఈ పద్దులను సభలో ప్రవేశపెట్టారు. పద్దుల్లో ప్రధానంగా ఆర్థిక నిర్వహణ , ఆర్థిక ప్రణాళిక, విద్యుత్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, పరిశ్రమల, ఐటి, ఎక్సైజ్ హోం, కార్మిక ఉపాధి,రవాణ, బీసీ సంక్షేమం,పాఠశాల విద్యా, ఉన్నత విద్యా, సాంకేతిక విద్యా, మెడికల్ అండ్ హెల్త్ తదితర 19 పద్దలపై చర్చించి ఆమోదం తెలుపుతున్నారు. ఈ పద్ధులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు సభలో ప్రవేశపెట్టారు.
Last Updated : Jul 29, 2024, 4:35 PM IST