భక్త జనసంద్రమైన యాదాద్రి - ఉచిత దర్శనానికి 2, ప్రత్యేక దర్శనానికి 1 గంట సమయం - Devotees Rush in Yadadri - DEVOTEES RUSH IN YADADRI
Published : Mar 31, 2024, 3:42 PM IST
Devotees Rush in Yadadri : ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారిని దర్శించుకోడానికి భక్తులు బారులు తీరారు. ఆలయదారులన్నీ సందడిగా మారాయి. ఈ కారణంగా స్వామి వారి ఉచిత దర్శనానికి దాదాపు 2 గంటలు, అలాగే ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుందని భక్తులు తెలిపారు.
Crowd of devotees in Yadadri Temple : ఆరాధనలతో నిత్య కల్యాణం, అష్టోత్తరంతో మండపాలు నిండిపోయాయి. ప్రసాదాల కొనుగోలుకు వేచి ఉన్న భక్తులతో విక్రయ విభాగం వద్ద గజిబిజి ఏర్పడింది. అధిక సంఖ్యలో భక్తులు ఉండటంతో ప్రసాద విక్రయ శాల, సత్య నారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి, బస్టాండ్లో భక్తుల సందడి నెలకొంది. కొండపైన స్థలం సరిపోకపోవడంతో చాలా సమయం యాత్రికుల వాహనాలను ఘాట్ రోడ్డు ఆరంభం వద్ద నిలిపివేశారు.