ప్రజలను రెచ్చగొడితే చూస్తూ ఊరుకోం : భట్టి విక్రమార్క - Bhatti Interesting Comments
Published : Jan 30, 2024, 5:00 PM IST
Deputy CM Bhatti Vikramarka on Law and Order Issue in Hyderabad : ఇందిరమ్మ రాజ్యంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హెచ్చరించారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా జీవించాలనే కాంగ్రెస్ సర్కార్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని రహమత్ నగర్ ప్రైమ్ గార్డెన్ సమావేశానికి భట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు.
Bhatti Vikramarka on Parliament Elections 2024 : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని భట్టి(Bhatti Vikramarka) తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇలాంటి వాటిని సహించేది లేదని స్పష్టం చేశారు. తమ పాలనలో స్వేచ్ఛగా జీవించాలనే ముఖ్య ఆలోచన అని అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రతి పౌరుడికి రక్షణ కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు. ప్రజలకు ఏ హామీలైతే ఇచ్చామో వాటిని అమలు పరుస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇంచార్జ్ మహమ్మద్ అజారుద్దీన్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.