తెలంగాణ

telangana

ETV Bharat / videos

బర్త్​ డే స్పెషల్​ - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం భట్టి - Deputy CM Bhatti birthday - DEPUTY CM BHATTI BIRTHDAY

By ETV Bharat Telangana Team

Published : Jun 15, 2024, 5:05 PM IST

Deputy CM Bhatti Vikramarka Birthday Celebrations at School : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ పాఠశాలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యార్థులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఆయనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులను పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉన్నాయోమోనని అడిగి తెలుసుకున్నారు. కొంత మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ కావాలని కోరారు.

మరికొంత మంది నీటి సమస్య ఉందని డిప్యూటీ సీఎంకు వివరించారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యార్థులకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 24 ఎకరాల్లో ఇంటర్నేషనల్‌ స్థాయిలో రెసిడెన్షియల్‌ పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్రప్రభుత్వం విద్యావైద్య రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాఠశాల మొత్తం కలియ తిరిగారు.

ABOUT THE AUTHOR

...view details