LIVE : దిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రెస్మీట్ - deputy cm bhatti pressmeet - DEPUTY CM BHATTI PRESSMEET
Published : Apr 1, 2024, 4:39 PM IST
|Updated : Apr 1, 2024, 5:17 PM IST
దిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. తాజా పరిస్థితులు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు, టికెట్ల కేటాయింపు, కరవు పరిస్థితులపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నాయకులంతా భారీగా కాంగ్రెస్‌లో చేరుతున్నారని భట్టి తెలిపారు. దీనిని కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని అందుకే తమ పార్టీపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. నిన్న కేసీఆర్ మాటల్లో కొంచెమైనా వాస్తవాలు లేవని, పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతగా దిగజారుతారా అని భట్టి ప్రశ్నించారు. కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని కేసీఆర్ ప్రయత్నించారని భట్టి ఆరోపించారు. నిన్న మైక్ సమస్య వస్తే కరెంట్ కోతలు అంటూ అబద్ధం మాట్లాడారని భట్టి మండిపడ్డారు. తెలంగాణకు 4వేల మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని విభజన చట్టంలోనే ఉందని, విభజన చట్టం ప్రకారమే రాష్ట్రానికి ఎన్టీపీసీ మంజూరు అయ్యిందని భట్టి గుర్తు చేశారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో భదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించాల్సి ఉందని అందువల్లే ఆలస్యం అవుతోందని తెలిపారు.
Last Updated : Apr 1, 2024, 5:17 PM IST