సిద్ధమవుతోన్న ఛాంబర్- డిప్యూటీ సీఎం పవన్ బాధ్యతల స్వీకరణ ఎప్పుడంటే! - Pawan Kalyan Will Take Charge 19th
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 17, 2024, 9:41 AM IST
Deputy Chief Minister Pawan Kalyan Will Take Charge on 19th : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ఈనెల 19న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. జనసేన పార్టీ కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తారు. ఈనెల 12న పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయనకు శాఖలు కేటాయించారు.
తన ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా శాఖలు ఉన్నాయని పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. వెలగపూడిలోని సచివాలయంలో డిప్యూటీ సీఎం కోసం ఛాంబర్ సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 19న బాధ్యతలు స్వీకరించనున్నట్టు పవన్ కల్యాణ్ ప్రకటించడంతో జనసేన వర్గాల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. అభిమానులు సైతం సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు.