తెలంగాణ

telangana

ETV Bharat / videos

భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి నీటిమట్టం - రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ - Declining Flood Flow to Bhadradri - DECLINING FLOOD FLOW TO BHADRADRI

By ETV Bharat Telangana Team

Published : Jul 26, 2024, 10:14 AM IST

Declining Flood Flow to Bhadrachalam : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతూ వస్తుంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 47.4 అడుగుల వద్దకు చేరుకుంది. గురువారం ఉదయం 48 అడుగులకు చేరుకున్న నీటిమట్టం రాత్రి నుంచి క్రమంగా తగ్గుతూ వస్తుంది. శుక్రవారం ఉదయానికి గోదావరి 47.4 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. గోదావరి నీటిమట్టం తగ్గడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు. మొదటి హెచ్చరిక అమలులో ఉన్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

ఎగువ నుంచి వస్తున్న వరద నీరు తగ్గటం వలన భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుతుందని కేంద్ర జలవనురుల శాఖ అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా గోదావరి నీటిమట్టం 45 అడుగులపైన నిలిచి ఉండడంతో భద్రాచలం స్నాన ఘట్టాల ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. భద్రాచలం నుంచి విలీన మండలాలైనా కూనవరం, చింతూరు, వీఆర్ పురం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

ABOUT THE AUTHOR

...view details