తెలంగాణ

telangana

ETV Bharat / videos

కొత్త జోన్లు రియల్‌ అవకాశాలు - హైదరాబాద్​ ముఖచిత్రం ఎలా ఉండబోతోంది? - Hyderabad Real EState market

By ETV Bharat Telangana Team

Published : Jan 20, 2024, 9:41 PM IST

Updated : Jan 20, 2024, 9:50 PM IST

Debate On Hyderabad Real EState : హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ రంగం ముఖచిత్రం ఎలా ఉండబోతోంది? కొంతకాలంగా పెద్దఎత్తునే చర్చ జరుగుతోన్న విషయం ఇది. ఆ విషయంలో నాది భరోసా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తన ఆలోచనల్నీ ఒక్కొక్కటిగా వెల్లడిస్తున్నారు. మరి ఆ దిశగా ఉన్న అవకాశాలు, సవాళ్లేంటి? అసలు ప్రస్తుతం  హైదరాబాద్ స్థిరాస్తి, నిర్మాణరంగం విపణి ఎలా ఉంది? కొత్త ప్రభుత్వం నుంచి పరిశ్రమవర్గాలేం కోరుకుంటున్నాయి?

హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ పరిధిలో జోన్ల పెంపు, మాస్టర్‌ ప్లాన్స్‌ మార్పుల ఆలోచనలు ఎలాంటి ప్రభావం చూపించవచ్చు? నగరంలో రియల్‌ ఎస్టేట్‌ ఎక్కువగా పశ్చిమ హైదరాబాద్‌లో భాగమైన కొండాపూర్‌, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ చుట్టుపక్కల కేంద్రీకృతమైంది. దానిని అన్నివైపులకు విస్తరించడమెలా? హైదరాబాద్ నగర రియల్‌ జోరు పెంచుతునే, అందరికీ అందుబాటులో నగరమన్న ట్యాగ్ పోకుండా ఎలాంటి జాగ్రత్తలతో ముందుకు సాగాలి? స్థిరాస్తి రంగం పరుగులు పెట్టాలంటే అనుమతుల ప్రక్రియ వేగవంతం కావాలి. ఆ విషయంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? క్లియరెన్స్‌లలో ఆలస్యాల నివారణకు మీరు ఏం ఆశిస్తున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

Last Updated : Jan 20, 2024, 9:50 PM IST

ABOUT THE AUTHOR

...view details