LIVE: డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ - ప్రత్యక్షప్రసారం - BALAYYA SPEECH IN DAKU MAHARAJ
Published : Jan 10, 2025, 7:47 PM IST
Daku Maharaj Pre release Event Live : హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగుతోంది. ఈ సినిమాలో డాకు మహారాజ్‌గా సందడి చేయనున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఆయన హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదిన ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓ ట్రైలర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా రిలీజ్ ట్రైలర్‌ను సైతం విడుదల చేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ మొదటగా ఏపీలో జరగాల్సి ఉంది. తిరుమల తొక్కిసలాటలో 6 మంది మృతి చెందిన కారణంగా ఈవెంట్ వాయిదా పడింది. ఆ వేదికను నిర్మాత హైదరాబాద్‌కు మార్చారు. ఏపీ ప్రభుత్వం ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతినిచ్చింది. తెలంగాణలో మాత్రం ప్రభుత్వాన్ని టికెట్ల ధరలు పెంచమని అడగలేదని నాగవంశీ తెలిపారు.