సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలి? - సైబర్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి? - Cyber Crime EXPERT Dhanya Menon - CYBER CRIME EXPERT DHANYA MENON
Published : May 1, 2024, 12:08 PM IST
First Woman Cyber Crime Investigator Dhanya Menon : చిన్నప్పటి నుంచి ఆమెకు డ్యాన్స్ అంటే ఇష్టం. పరీక్షల్లో మంచి మార్కులు వస్తేనే డ్యాన్స్ నేర్పిస్తానని అమ్మ చెప్పిన మాటలతో కష్టపడి చదివేది. ఆమెలోని ప్రతిభ చూసి లా చదవమని వారి తాత చెప్పారు. ఆ మాటల స్ఫూర్తితో నేడు దేశంలోనే మొట్టమొదటి మహిళా సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్‌గా పేరు సంపాదించారు కేరళకు చెందిన ధన్య మీనన్. సైబర్ నేరాలు అంటే ఏంటో తెలియని సమయంలోనే ఈ రంగంలోకి అడుగుపెట్టారు.
Dhanya Menon Latest Interview 2024 : తన సేవలకుగాను ధన్య మీనన్ రాష్ట్రపతితో పాటు మరెందరో ప్రముఖుల చేతుల మీదుగా అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. ఆమె కెరీర్‌లో ఎన్నో కేసులు ఛేదించారు. వ్యక్తిగతంగానే కాకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్నారు. అసలు సైబర్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి? మనీ ఫ్రాడ్స్‌తో పాటు ఎలాంటివి సైబర్ క్రైమ్ కిందకి వస్తాయి. సోషల్ మీడియా పట్ల ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలనే విషయాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.