సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: బీవీ రాఘవులు - BV RAGHAVULU ON IRRIGATION PROJECTS - BV RAGHAVULU ON IRRIGATION PROJECTS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 15, 2024, 4:45 PM IST
CPM Leader BV Raghavulu on Irrigation Projects: రాష్ట్రంలో అన్ని సాగునీటి ప్రాజెక్టులపై కొత్త ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో జలాశయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో దెబ్బతిన్న సోమశిల జలాశయ ఆఫ్రాన్ను సందర్శించిన ముగ్గురు మంత్రులు ప్రాజెక్టు పనుల కోసం 100 కోట్ల రూపాయలు ప్రకటించటంపై బీవీ రాఘవులు హర్షం వ్యక్తం చేశారు.
అలాగే రాష్ట్రంలో మిగిలిన జలాశయాల పైనా దృష్టి సారించాలని ఆయన కోరారు. పోలవరం, జంధ్యావతి, వెలుగొండ ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో చంద్రబాబు రాజధాని నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా జగన్కు ఇస్తే, ఆయన అమరావతినే లేకుండా చేశారని విమర్శించారు. కొత్త ప్రభుత్వం రాజధాని అమరావతిని త్వరతిగతిన పూర్తి చేయాలని సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు కోరారు.