కొండాపూర్ ఫ్లైఓవర్ నుంచి కిందపడి ఆవు మృతి - వీడియో వైరల్ - Cow Died Jump Down Kondapur Flyover - COW DIED JUMP DOWN KONDAPUR FLYOVER
Published : Jul 9, 2024, 10:32 PM IST
Cow Died Jump Down from Top of Kondapur Flyover : పాపం ఆవు ప్రమాదవశాత్తు ఫ్లైఓవర్ పై నుంచి కిందకు దూకి ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన హైదరాబాద్లోని కొండాపూర్ పైవంతెన వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, అప్పటివరకు రోడ్డు మీద ఉన్న ఆవు ఒక్కసారిగా కొండాపూర్ పై వంతెన పైకి ఎక్కింది. అక్కడ ఆ వాహనాల రద్దీని చూసి భయపడిపోయింది. దీంతో అపసవ్య దిశలో కొత్తగూడ వైపు బయలుదేరింది.
అయితే ఎదురుగా వేగంగా వస్తున్న వాహనాలను చూసి భయపడిన ఆవుకు ఎటువైపు వెళ్లాలో అర్థం కాలేదు. దీంతో ఒక్కసారిగా భయకంపితురాలై పై వంతెన నుంచి ఒక్కసారిగా కిందకు దూకింది. దీంతో తీవ్రగాయాలైన ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఆవు దూకిన సమయంలో కింద రోడ్డు మీద మనుషులు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ఆవు పడిన వెంటనే చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూసిన లాభం లేకుండా పోయింది.