తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : పార్లమెంట్​లో రాజ్యాంగ వజ్రోత్సవాలు కార్యక్రమం - CONSTITUTIONAL DIAMOND JUBILEE

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2024, 11:18 AM IST

Updated : Nov 26, 2024, 11:57 AM IST

Constitutional Diamond Jubilee Programs in Parliament Live : పార్లమెంటులో రాజ్యాంగ వజ్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేతృత్వంలో కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, లోక్​సభ స్పీకర్‌ ఓం బిర్లా పాల్గొన్నారు. అలాగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తి సందర్భంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఓంబిర్లా ప్రారంభ ఉపన్యాసం చేశారు. రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్న కోట్లాది భారతీయులకు అభినందనలు తెలిపారు. 75 ఏళ్ల క్రితం ఈ పవిత్ర ప్రదేశంలోనే రాజ్యాంగం ఆమోదం పొందిందని ఆయన తెలిపారు. దేశమంతా ఐక్యంగా రాజ్యాంగ దినోత్సవాలు జరుపుకుంటోందని ఆనందం వ్యక్తం చేశారు. దేశ పౌరులు రాజ్యాంగ పీఠిక సామూహిక పఠన సంకల్పం తీసుకోవాలని సూచించారు. ప్రధాని ప్రేరణతో 2015 నుంచి ఏటా రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. దార్శనికుల త్యాగాలు, శ్రమ ఫలితంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని అన్నారు. 
Last Updated : Nov 26, 2024, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details