సార్ ఎగ్జామ్‌కు లేటవుతోంది కాస్త లిఫ్ట్ ఇస్తారా - సివిల్స్ అభ్యర్థికి కానిస్టేబుల్ సాయం - upsc prelims exam 2024 - UPSC PRELIMS EXAM 2024
Published : Jun 16, 2024, 2:05 PM IST
Constable Helped UPSC Aspirant To Reach Exam Hall : యూపీఎస్సీ పరీక్షకు ఆలస్యం అవుతోందని ఓ అభ్యర్థినికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సాయం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్ ద్విచక్ర వాహనంపై ఆ యువతిని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారు. సమయానికి ఆమెను కేంద్రానికి తీసుకెళ్లడంతో కానిస్టేబుల్ సురేశ్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.
కాగా ఇవాళ దేశ వ్యాప్తంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 వరకు పేపర్-1 పరీక్ష జరిగింది. మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు పేపర్-2 ఎగ్జామ్ కొనసాగింది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే అన్ని గేట్లు మూసివేస్తారని అభ్యర్థులు సమయానికి కేంద్రానికి చేరుకోవాలని ముందే సూచించారు. మొత్తం 1,056 ఉద్యోగాలాకు ప్రిలిమ్స్‌కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని పలు కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షకు ఆలస్యంగా రావడంతో పోలీసులు లోనికి అనుమతించలేదు. దీంతో ఏమీ చేయలేక గేటు బయటే కొందరు ఆగిపోయారు.