LIVE : సీఎల్పీ కార్యాలయంలో మంత్రుల మీడియా సమావేశం - CONGRESS MINISTERS LIVE TODAY - CONGRESS MINISTERS LIVE TODAY
Published : Jun 20, 2024, 1:46 PM IST
|Updated : Jun 20, 2024, 2:03 PM IST
Congress Ministers Press Meet Live Today : దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్-యూజీ ప్రవేశపరీక్ష 2024’లో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిహార్‌లో ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు సమాచారం రాగా కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని తోసిపుచ్చింది. అయితే, పేపర్ లీక్ నిజమేనని తాజాగా బయటికొచ్చింది. ముందురోజు రాత్రే నీట్ ప్రశ్నపత్రం తమకు అందిందని బిహార్‌లో అరెస్టయిన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీకరించారు. మరోవైపు ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులు ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై రాష్ట్ర మంత్రులు స్పందించారు. ఈ సందర్భంగా సీఎల్పీ కార్యాలయంలో మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ నీట్ పరీక్షకు సంబంధించిన అవకతవకలపై కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Last Updated : Jun 20, 2024, 2:03 PM IST