కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు - Congress Leaders Blocked KTR Convoy - CONGRESS LEADERS BLOCKED KTR CONVOY
Published : Oct 1, 2024, 3:20 PM IST
Congress leaders blocked KTR's Convoy in Musheerabad : హైదరాబాద్‌లో మూసీ బాధితులను కలవడానికి వచ్చి తిరిగి వెళుతున్న బీఆర్ఎస్ కార్యనిర్వహాక అధ్యక్షుడు కేటీఆర్‌ను ముషీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీ రామారావు, స్థానిక శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ పర్యటించారు. కూల్చివేతల గురించి స్థానికులను అడిగి తెలుకున్నారు. అక్కడ బాధితులను కలిసి మాట్లాడారు.
ఆ తర్వాత ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠాగోపాల్ ఇంట్లో భోజనానికి గాను విద్యానగర్ మీదుగా వెళుతుండగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. కొండా సురేఖ ప్లే కార్డ్ పట్టుకుని నినాదాలు చేశారు. వెంటనే కేటీఆర్ భద్రత సిబ్బంది పరుగున వచ్చి కాంగ్రెస్ నేతలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకుని కాంగ్రెస్ నేతలను అక్కడ నుంచి పంపించి వేశారు.