త్వరలోనే ధరణి పోర్టల్‌పై మధ్యంతర నివేదిక : కోదండ రెడ్డి - ధరణిపై కోదండ రెడ్డి ఇంటర్వ్యూ
Published : Feb 5, 2024, 5:00 PM IST
Congress Leader Kodanda Reddy Interview : ధరణి పోర్టల్ ద్వారా ఉత్పన్నమైన సమస్యలపై అధ్యయనం చేస్తున్న ధరణి కమిటీ త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డికి మధ్యంతర నివేదిక ఇవ్వనున్నట్లు కమిటీ సభ్యుడు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి(Kodanda Reddy) తెలిపారు. ఇప్పటికే ధరణి సమస్యలపై కమిటీ సభ్యులు అధికారులతో, కలెక్టర్లతో, వివిధ శాఖల ప్రతినిధులతో చర్చించినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ధరణి చట్టం(Dharani Act) అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన 35 మాడ్యూల్స్‌ను కూడా పరిశీలించినట్లు చెప్పారు.
Dharani Act Issue in Telangana : చట్టంలో అధికారులకు అధికారాల బదలాయింపు గురించి ప్రస్తావన లేదని, ఎలాంటి మార్గదర్శకాలు కూడా లేవని కోదండ రెడ్డి తెలిపారు. దీనివల్ల అధికారులు ముందుకు పోలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ వ్యవస్థ అంతా కూడా ఛిన్నాభిన్నమైందని అన్నారు. కలెక్టర్ల స్థాయిలో సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం లేకుండా పోయిందని వాపోయారు. ఈ పోర్టల్‌లో సమస్యలు, పరిష్కారం కోసం చేస్తున్న మార్గాల గురించి కోదండ రెడ్డితో ముఖాముఖిలో తెలుసుకుందాం.