తెలంగాణ

telangana

ETV Bharat / videos

సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలు అమలయ్యే బాధ్యత మాది : షబ్బీర్ అలీ - Shabbir Ali on SC ST BC Minorties

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2024, 3:50 PM IST

Congress Advisor Shabbir Ali Press Meet : కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో హామీలు ఇస్తే అవి కచ్చితంగా అమలు అయ్యేలా చూస్తామని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. తాము ఇచ్చిన హామీల మీద తమ నలుగురు ఛైర్మన్‌లతో చర్చించామని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల జనాభా 85 శాతం ఉందని, ఈ సామాజిక తరగతులకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను, వారి అభివృద్ధి పూర్తి చేయాల్సిన బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలపై వంద రోజుల్లో ఎలా పూర్తి చేయాలనే అంశంపై ఇవాళ సమీక్షించుకున్నామని పేర్కొన్నారు.

Shabbir Ali about Budget : తాను రేపు లేదా ఎల్లుండి బాధ్యతలు తీసుకున్న తర్వాత వివిధ శాఖల కార్యదర్శులతో మాట్లాడుతానని షబ్బీర్​ అలీ తెలిపారు. కాంగ్రెస్​ ప్రకటించిన హామీలలో ఏమైనా మార్పులుంటే బడ్జెట్​కు అనుగుణంగా వాటిని చర్చించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఆదేశాల మేరకు రానున్న బడ్జెట్​లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన హామీలు త్వరగా అమలయ్యేలా ఈ సమావేశం నిర్వహించామని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details