ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సత్తెనపల్లిలో వైఎస్సార్సీపీ ప్రలోభాల పర్వం - చీరల పంపిణీని అడ్డుకున్న టీడీపీ శ్రేణులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 20, 2024, 8:30 PM IST

YSRCP Leader Temptations in Sattenapalli: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్సార్సీపీ నాయకుల ప్రలోభాల పర్వం మెుదలైంది. ఈ  ఘటనను తెలుగుదేశం నేతలు అడ్డుకోవటంతో గొడవకు దారి తీసింది. వైఎస్సార్సీపీ నేత కళ్లెం విజయబాస్కర్ రెడ్డికి చెందిన కేవీఆర్ మార్ట్​లో ఓటర్లకు పంచటానికి చీరలు తెప్పించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ 2 వేల చీరల్ని స్వాధీనం చేసుకుంది. దీంతో టీడీపీ, వైఎస్సార్సీపీ నేతల మధ్య గొడవ జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. విజయభాస్కర రెడ్డి మంత్రి అంబటికి ప్రధాన అనుచరుడు కాగా కొనసాగుతున్నారు.

 రాబోయే ఎన్నికల్లో అంబటి కోసమే చీరలు పంచేందుకు తెచ్చారని టీడీపీ నేతలు  ఆరోపిస్తున్నారు. ఓటర్లకు పంచెందుకే ఈ చీరలు తెచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన అంబటి రాంబాబుపై చర్యలు చేపట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ వైఎస్సార్సీపీ నేతలు తమకు ఆ నిబంధనలు వర్తించవన్నట్లుగా  వ్యవహరిస్తున్నారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details