Ministers have Expressed Nara Ramamurthy Naidu Condolences : ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, కొల్లురవీంద్ర, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, నారాయణ, నిమ్మల రామానాయుడు, డోలాబాలవీరాంజనేయస్వామి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కందుల దుర్గేష్, బీసీ జనార్థన్ రెడ్డి, సవిత, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు.
ప్రముఖుల సంతాపం: తమ్ముడు రామ్మూర్తినాయుడు నన్ను విడిచి వెళ్లిపోయాడని బాధాతప్త హృదయంతో అందరికీ తెలియచేస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. రామ్మూర్తి నాయుడు ప్రజాజీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు చేశాడని కొనియాడారు. మా నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదం నింపాడని, రామ్మూర్తినాయుడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.
నా తమ్ముడు, చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మనల్ని విడిచి వెళ్లిపోయాడని బాధాతప్త హృదయంతో అందరికి తెలియచేస్తున్నాను. రామ్మూర్తి నాయుడు ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు అందించిన నాయకుడు. మా నుంచి దూరమైన మా సోదరుడు మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని… pic.twitter.com/uZElKIo85x
— N Chandrababu Naidu (@ncbn) November 16, 2024
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి : ఎమ్మెల్యేగా చంద్రగిరి నియోజకవర్గానికి నారా రామ్మూర్తి నాయుడు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం నారా రామ్మూర్తి నాయుడు అందించిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయమన్నారు. మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కుటుంబసభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చిన్నాన్నకు కన్నీటితో నివాళులు : చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడు మృతి తీవ్ర విషాదం నింపిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. చిన్నాన్నకు కన్నీటితో నివాళులు అర్పిస్తున్నానని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. పినతండ్రి రామ్మూర్తితో చిన్నప్పటి అనుబంధం కళ్ల ముందు కదులుతోందన్నారు. మౌనమునిలా మారిన చిన్నాన్న ఇన్నాళ్లూ మాకు కంటికి కనిపించే ధైర్యం నేటి నుంచి చిరకాల జ్ఞాపకమన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అంతులేని దుఃఖంలో ఉన్న తమ్ముళ్లు, పిన్ని దైర్యంగా ఉండాలని కోరుతున్నానన్నారు.
చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడు గారి మృతి తీవ్ర విషాదం నింపింది. చిన్నాన్నతో చిననాటి నా అనుబంధం కళ్ల ముందు కదిలి వచ్చిన కన్నీటితో నివాళులు అర్పిస్తున్నాను. మౌనమునిలా మారిన చిన్నాన్న ఇన్నాళ్లూ మాకు కంటికి కనిపించే ధైర్యం..నేటి నుంచి చిరకాల జ్ఞాపకం. చిన్నాన్న ఆత్మకు… pic.twitter.com/5kXf2JkyAa
— Lokesh Nara (@naralokesh) November 16, 2024
చంద్రబాబు మహారాష్ట్ర పర్యటనను రద్దు : ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు ఈరోజు మధ్యాహ్నం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1994లో టీడీపీ నుంచి చంద్రగిరి ఎమ్మెల్యేగా రామ్మూర్తినాయుడు ఎన్నికయ్యారు. రామ్మూర్తినాయుడికి భార్య ఇందిర, ఇద్దరు కుమారులున్నారు. రామ్మూర్తి నాయుడు పెద్ద కుమారుడు గిరీష్ విదేశాల్లో ఉంటుండగా చిన్నకుమారుడు రోహిత్ సినీ కథానాయకుడిగా రాణిస్తున్నారు. రామ్మూర్తి నాయుడు మరణవార్తతో ముఖ్యమంత్రి చంద్రబాబు మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నారు. దిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లారు.
బైక్ చక్రంలో చిక్కిన చీరకొంగు - కిందపడి మహిళ మృతి
రామోజీరావు జీవితం స్పూర్తిగా ముందడుగు వేద్దాం: సీఎం చంద్రబాబు