Lack of Basic Facilities in Manyam District: గిరిజన తండాల్లో జీవనాన్ని సాగించే ప్రజలకు మౌలిక సౌకర్యాల కొరత పట్టిపీడుస్తోంది. నూతనంగా రోడ్లు, వంతెనలు, పాఠశాలలు నిర్మించాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటికీ ఎన్నికలప్పడే ఆ హామీలన్నీ గుర్తొస్తాయి కానీ ఇప్పుడు కాదు అనే విధంగా నాయకుల తీరు ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇటువంటి వెనకపడిన ప్రాంతాల వైపు చూసే పరిస్థితి ఉండడం లేదు. అల్లూరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంచినీళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, విద్య, వైద్యం మొదలైన సదుపాయాలు ఆమడ దూరంలో ఉన్నాయి. వివరాల్లోనికి వెళ్తే
రెండు మండలాలు, రెండు నియోజకవర్గాలు ఒకే గ్రామంలో: అల్లూరి జిల్లాలో రహదారి సక్రమంగా లేని మారుమూల ప్రాంతం సీసీ రహదారికి కుడి పక్కన రాజుపేట, ఎడం పక్కన కొత్త బొర్రంపేట ఉన్నాయి. రాజుపేట రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలో ఉండగా, కొత్త బొర్రంపేట పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలంలో ఉన్నది. అయితే ఈ ప్రాంతంలో రహదారి సక్రమంగా లేక రెండు నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. ఇక్కడ ప్రజలు మౌలిక సదుపాయాలైన మంచినీళ్లు, అంగన్వాడీ, ఆశా కార్యకర్త, వైద్యం రహదారికి దూరంగా ఉన్నారు.
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కనిపించే నాయకులు మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు కనిపించడం లేదని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ సెంటర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బడదనాంపల్లిలో ఉందని, సుమారు 30 మంది పిల్లలు ఇక్కడికి వెళ్లేందుకు ఇష్టపడడం లేదని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఎప్పుడో కట్టిన పాఠశాల భవనం కూడా ఇప్పుడు శిథిలావస్థలో ఉందని కొత్త భవనం నిర్మించాలని ప్రజలంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
స్థానికతను కోల్పోతున్నామని ప్రజల ఆవేదన: రెండు మండలాలు రెండు నియోజకవర్గాలు ఒకే గ్రామంలో ఉండటం వలన ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో స్థానికతను కోల్పోతున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. సీసీ రహదారి సరిహద్దు లో రెండు గ్రామాలు రెండు మండలాలు రెండు నియోజకవర్గాలుగా ఉండే ఈ ఈ సరిహద్దును భౌగోళికంగా సరిచేసి మౌలిక సదుపాయాలు అందేలా చేయాలని స్థానికులు కోరుతున్నారు.
కృష్ణానదిలో కొట్టుకుపోతున్న ఊరు.. ఆందోళనలో గ్రామస్థులు