కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు జరగకుండా చూడాలి - అధికారులకు కలెక్టర్ సూచన - Complaint to NGT on sand mining
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 13, 2024, 3:05 PM IST
Collector Inspects Sand Reaches in Amaravati: పల్నాడు జిల్లా అమరావతిలో ఇసుక రీచ్‌లను కలెక్టర్ శివశంకర్ పరిశీలించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు గనులు, కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. కృష్ణానదిలో ఇసుక తవ్వకాలపై దండా నాగేంద్ర అనే వ్యక్తి ఎన్టీటీ (NGT)కి ఫిర్యాదు (Complaint to NGT on Sand Mining) చేయటంతో తవ్వకాలు ఆపాలని జాతీయ హరిత గ్రీన్ ట్రిబ్యునల్ (National Green Tribunal) ఆదేశించింది. అయితే ఎన్టీటీ ఆదేశాలను పట్టించుకోకుండా రాష్ట్రంలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు.
National Green Tribunal on Sand Mining: దీంతో హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు అమలు చేయటం లేదని, ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్నారని పిటిషనర్ మరోసారి ఎన్టీటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలించాలని ఎన్జీటీ కలెక్టర్‌ను ఆదేశించింది. ఇకపై ఇసుక తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గనులు, రెవెన్యూ శాఖల అధికారులకు సూచించారు.