మున్సిపల్ సిబ్బందిపై కొబ్బరి బోండాల నిర్వాహకుల రాళ్ల దాడి - Attack on municipal staff - ATTACK ON MUNICIPAL STAFF
Published : Mar 29, 2024, 10:26 PM IST
Attack on Municipal Staff in Rajendranagar circle : ఫుట్‌పాత్‌పై ఉన్న కొబ్బరి బొండాల దుకాణాన్ని తొలగిస్తున్న క్రమంలో, మున్సిపల్ సిబ్బందిపై రాళ్లతో దాడి చేసిన ఘటన రాజేంద్రనగర్ సర్కిల్ డెయిరీ ఫామ్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెల్తే రాజేంద్రనగర్ సర్కిల్ వద్ద ఉన్న ఫుట్‌పాత్‌పై గత కొన్ని రోజులుగా కొబ్బరి బొండాలు విక్రయిస్తున్నారు. ఫుట్‌పాత్‌పై కొబ్బరి బొండాలు విక్రయిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు నమోదు చేసుకున్న అధికారులు, కొబ్బరి బొండాల బండిని తొలగించడానికి మున్సిపల్ సిబ్బందిని పంపించారు. వ్యాన్‌తో వచ్చిన జీహెచ్ఎంసీ సిబ్బంది, కొబ్బరి బొండాలను బండిని తొలగిస్తుండగా, అకస్మాత్తుగా విక్రయదారులు వచ్చి సిబ్బందిపై దాడి చేశారు. విచక్షణారహితంగా రాళ్లతో దాడిచేసి గాయపరిచారు. ఈదాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు అడ్డుకోవడంతో మున్సిపల్ సిబ్బందికి ప్రాణగండం తప్పింది. దాడి చేసిన వ్యక్తులపై మున్సిపల్ సిబ్బంది రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పట్టపగలే జరిగిన ఈ ఘటన స్థానికులను కాసేపు భయభ్రాంతులకు గురిచేసింది.