గడిచిన ఐదేళ్లలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిజామాబాద్‌లో అభివృద్ధి : జీవన్‌రెడ్డి - Jeevan Reddy On CM visit - JEEVAN REDDY ON CM VISIT
Published : Apr 21, 2024, 5:00 PM IST
Jeevan Reddy On CM Nizamabad Tour : తన నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ పాత కలెక్టర్ బంగ్లా మైదానంలో సోమవారం నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్లపై పలు విమర్శలు గుప్పించారు.
గడచిన ఐదేళ్లలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు రైతులను మోసం చేశారని జీవన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని గులాబీ పార్టీపై మండిపడ్డారు. నిజామాబాద్‌లో అభివృద్ధి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుందన్న జీవన్ రెడ్డి, తాను ఎంపీగా గెలిపొందాక జిల్లాలో అవసరమైన కార్యక్రమాలు చేపడతానని వివరించారు. సోమవారం నిజామాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి రానున్న వేళ పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.