LIVE : భద్రాద్రి రామయ్య సన్నిధిలో సీఎం రేవంత్‌రెడ్డి
Published : Mar 11, 2024, 1:06 PM IST
|Updated : Mar 11, 2024, 1:30 PM IST
Revanth Live : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. హెలీకాప్టర్‌లో సారపాకకు చేరుకుని, అక్కడ్నుంచి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దర్శించుకుంటున్నారు. రాములోరి దర్శనం అనంతరం మార్కెట్ యార్డులో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించి, అనంతరం మణుగూరులో సాయంత్రం జరిగే ప్రజా దీవెన సభకు హాజరవుతారు. తొలిసారి సీఎం హోదాలో జిల్లాకు రానున్న రేవంత్‌రెడ్డికి అట్టహాసంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు, ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. భద్రాచలంతో పాటు సభ జరిగే మణుగూరులో పోలీసు యంత్రాంగం పటిష్ఠ భద్రత చర్యలను చేపట్టింది. రామాలయ ప్రధాన వీధులు, వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఆదివారం నుంచే బందోబస్తు ఏర్పాటు చేశారు. జాగిలాలు, మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు జరిపారు. సీఎం రామాలయ సందర్శన సందర్భంగా మాడవీధుల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సారపాక నుంచి ఆలయం వరకు రోడ్డు మార్గంలో వాహన శ్రేణి సులభంగా చేరుకునేలా బారికేడ్లు ఏర్పాటు చేశారు. భద్రాద్రి అభివృద్ధిపై సీఎం వరాలు కురిపిస్తారని ఆశిస్తున్న తరుణంలో ఈఓ రమాదేవి సైతం ప్రత్యేకంగా రూపొందించిన ప్రతిపాదనలను సమీక్షలో ఆయనకు అందజేయనున్నారు.
Last Updated : Mar 11, 2024, 1:30 PM IST