LIVE : కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణలో రేవంత్ రెడ్డి - cm revanth reddy - CM REVANTH REDDY
Published : Jul 28, 2024, 5:15 PM IST
|Updated : Jul 28, 2024, 6:26 PM IST
Former Union Minister Jaipal Reddy Statue : కేంద్ర మాజీమంత్రి, దివంగత నేత జైపాల్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తిలో హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై కొట్రా తండా చౌరస్తాలో ఏర్పాటు చేసిన జైపాల్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. అనంతరం జైపాల్‌రెడ్డి సంస్మరణ సభలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, దేశ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర కీలకమని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్న నేతలలో జైపాల్‌రెడ్డి ఒకరని ఆయన తెలిపారు. జైపాల్ రెడ్డి జీవితం భావితరాలకు ఆదర్శమని సీఎం పేర్కొన్నారు. ఆయన సేవలను కొనియాడారు. కేంద్రంలో చక్రం తిప్పిన నేతలలో జైపాల్ రెడ్డి ఒకరని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర కీలకమని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్న నేతలలో జైపాల్‌రెడ్డి ఒకరని ఆయన తెలిపారు. జైపాల్ రెడ్డి జీవితం భావితరాలకు ఆదర్శమని సీఎం పేర్కొన్నారు. ఆయన సేవలను కొనియాడారు.
Last Updated : Jul 28, 2024, 6:26 PM IST