తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : ఖమ్మం వరదలపై సీఎం రేవంత్​ రెడ్డి సమీక్షా సమావేశం - CM Revanth On Khammam Floods - CM REVANTH ON KHAMMAM FLOODS

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2024, 6:43 PM IST

Updated : Sep 2, 2024, 7:58 PM IST

CM Revanth Review Meeting On Khammam Floods : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మంత్రులతో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వరద బాధితులకు తక్షణ సాయంగా రూ.10వేల ఆర్థిక సాయం ప్రకటించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయాలని అన్నారు. విద్యుత్​ సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఖమ్మంలోని వరద సమస్యలపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో వర్షాలపై కమాండ్ కంట్రోల్​ సెంటర్​లో సమీక్ష ముగిసిన అనంతరం రోడ్డు మార్గం ద్వారా సీఎం రేవంత్​ ఖమ్మం బయలుదేరారు. అక్కడికి చేరుకున్న తర్వాత వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. మున్నేరు వాగు చేసిన విధ్వంసాన్ని అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం ఆ ప్రాంతాలను సీఎం రేవంత్​ రెడ్డి పర్యవేక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా కల్పించారు.
Last Updated : Sep 2, 2024, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details