తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE - వైరా బహిరంగ సభలో మూడో విడత రుణమాఫీని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్​ - Third Phase Loan waiver Releases - THIRD PHASE LOAN WAIVER RELEASES

By ETV Bharat Telangana Team

Published : Aug 15, 2024, 3:47 PM IST

Updated : Aug 15, 2024, 5:18 PM IST

CM Revanth Releases Third Phase RunaMafi Live : గురువారం ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్​రెడ్డి​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్షన్నర నుంచి 2 లక్షలలోపు రుణమాఫీ ప్రకటించారు. అనంతరం మూడోవిడత రుణమాఫీ చెక్కులను అందించారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో మాఫీ సొమ్ము జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా రైతులను రుణ విముక్తులను చేసేందుకు 31 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. లక్ష వరకు రుణం ఉన్న 11లక్షల 14వేల 412 మంది రైతులకు జులై 18న 6034 కోట్లు విడుదల చేసింది. లక్ష నుంచి లక్షన్నర లోపు రుణాలున్న 6 లక్షల 40 వేల 823 మంది రైతుల ఖాతాల్లో జులై 30న 6190  కోట్లు జమ చేసింది. ఈ నేపథ్యంలో లక్షన్నర నుంచి 2 లక్షల లోపు రుణం కలిగిన రైతులకు ఇవాళ మాఫీ ప్రక్రియ పూర్తి చేసింది.
Last Updated : Aug 15, 2024, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details