LIVE : డీఎస్సీ ఫలితాలు విడుదల చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth Release DSC Results Live - CM REVANTH RELEASE DSC RESULTS LIVE
Published : Sep 30, 2024, 12:05 PM IST
|Updated : Sep 30, 2024, 12:33 PM IST
CM Revanth Reddy Release DSC Results 2024 : తెలంగాణ డీఎస్సీ ఫలితాలు నేడు విడుదల అవుతున్నాయి. ఈ మేరకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో ఉ.11 గం.కు డీఎస్సీ ఫలితాలను విడుదల చేస్తున్నారు. మార్చి 1న 11,062 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాగా, జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 2.45 లక్షల మంది హాజరయ్యారు. ఆగస్టు 13న డీఎస్సీ ప్రిలిమినరీ కీ విడుదల చేయగా దానిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి సెప్టెంబర్ 6న డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ తుది కీ విడుదల చేసింది. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, సెకెండరీ గ్రేడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించి పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. డీఎస్సీ అభ్యర్థులను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా డీఎస్సీ ఫలితాల కార్యక్రమాన్ని వీక్షిద్దాం.
Last Updated : Sep 30, 2024, 12:33 PM IST