LIVE : ముచ్చర్లలో స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన - పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి - Skill University Program Live - SKILL UNIVERSITY PROGRAM LIVE
Published : Aug 1, 2024, 6:55 PM IST
|Updated : Aug 1, 2024, 7:56 PM IST
CM Revanth Reddy at Foundation Laying Ceremony of Skill University : ముచ్చర్లలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. తెలంగాణ యువతకు సాంకేతిక నైపుణ్యాలు అందించి వారికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ నిర్మించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టారు. సాంకేతిక నైపుణ్యాలు పెంచుకుని ప్రపంచంతో యువతతో పోటీ పడాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. యుంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చలో మాట్లాడిన ముఖ్యమంత్రి విద్యార్థుల కోసం 17 కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. వృత్తి నైపుణ్యం లేకపోవడంతో పట్టాలు ఉన్నా ఉద్యోగాలు దొరకడం లేదన్న రేవంత్ దేశానికి ఆదర్శంగా నిలపాలనే ఉద్దేశంతో స్కిల్ వర్సిటీ రూపకల్పన చేసినట్టు తెలిపారు. ఏడాదికి రూ.50వేలు నామ మాత్రపు ఫీజుతో కోర్సుల శిక్షణ అందించనున్నట్లు సీఎం రేవంత్ వివరించారు. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఉచితంగా అందిస్తామని అన్నారు.
Last Updated : Aug 1, 2024, 7:56 PM IST