LIVE : సచివాలయంలో 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' స్కీమ్ పథకం - CM Revanth Meets Upsc Winners - CM REVANTH MEETS UPSC WINNERS
🎬 Watch Now: Feature Video
Published : Jul 20, 2024, 10:54 AM IST
|Updated : Jul 20, 2024, 11:29 AM IST
CM Revanth Reddy Meet With Upsc Winners Live : 2023 సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి సమావేశమయ్యారు. ప్రజాభవన్‌లో ఈ సమావేశం జరుగుతోంది. ప్రిలిమ్స్ పాసైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. మెయిల్స్ కూడా సాధించేలా ప్రభుత్వం తరపున సాయంపై వారితో చర్చించారు. యూపీఎస్సీలో రాష్ట్రం నుంచి ఎంపికయ్యే వారి సంఖ్య పెంచేలా ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరుతో సింగరేణి ద్వారా వారికి ఆర్థిక సాయం అందించేలా ఈ స్కీమ్ రూపొందించారు. ఇందులో భాగంగా మెయిల్స్‌కు ప్రిపేర్ అయ్యేవారితో ముఖ్యమంత్రి సమావేశమై వారికి ఆర్థికసాయం అందిస్తున్నారు. పరీక్షలకు సన్నద్దం అయ్యేటప్పుడు ఎదుర్కొనే సమస్యలపై ముఖ్యమంత్రి అభ్యర్థులతో చర్చించారు. యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేవారికి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి సహాయక చర్యలు చేపడితే వారికి దోహదపడుతుందని, వారికి సూచనలు, సలహాలు తెలుసుకున్నారు. ఈ సమావేశానికి 2023లో సివిల్స్ ప్రిలిమ్స్ సాధించిన అభ్యర్థులు హాజరయ్యారు.
Last Updated : Jul 20, 2024, 11:29 AM IST