LIVE : కోరుట్ల కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth Election Campaign - CM REVANTH ELECTION CAMPAIGN
Published : May 1, 2024, 1:30 PM IST
|Updated : May 1, 2024, 2:33 PM IST
CM Revanth Live : తెలంగాణలో అత్యధిక లోక్సభ స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుడటంతో ప్రచారాలు మరింత జోరందుకున్నాయి. హస్తం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాల్లో విస్తృతంగా ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి పార్టీ శ్రేణులు శ్రమించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీలపై రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తొలుత జగిత్యాల జిల్లా కోరుట్లలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఈరోజు రాత్రి కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మొదట కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. ఈ మీటింగ్ అనంతరం శేరిలింగంపల్లి కార్నర్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు.
Last Updated : May 1, 2024, 2:33 PM IST