LIVE : సీతారామ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - Revant open Sitarama Project - REVANT OPEN SITARAMA PROJECT
Published : Aug 15, 2024, 1:36 PM IST
CM Revanth Reddy Launched Sitarama Project : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో సీతారామ ప్రాజెక్టులోని పూసుగూడెం పంప్ హౌస్‌ను ప్రారంభించారు. ముందుగా హైదరాబాద్‌లోని పంద్రాగస్టు వేడుకల్లో ప్రసంగించిన అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో తొలుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరుకున్నారు. అక్కడ సీతారామ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన రెండోదైన పూసుగూడెం పంప్ హౌస్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అక్కడే గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సీతారామ ప్రాజెక్టులో భాగంగా మొత్తం మూడు పంప్ హౌస్‌ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. ఈ మూడు పంప్ హౌస్‌లను ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. ముల్కలపల్లి మండలం పూసుగూడెం పంప్ హౌస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించగా, కమలాపూర్ పంప్ హౌస్‌ను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు తొలి పంప్‌హౌస్‌ను జిల్లా ఇంఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మూడో విడత రుణమాఫీలో భాగంగా రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణాల ప్రక్రియను ప్రారంభించనున్నారు.