LIVE : సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
Published : 6 hours ago
|Updated : 5 hours ago
CM Revanth Reddy Live : సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్ లో ఏర్పాటు చేసిన కోకో కోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంటును పరిశ్రమను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కోకోకోలా, థమ్స్అప్ లాంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బివరేజెస్ సంస్థ బండ తిమ్మాపూర్ ఫుడ్ పార్కులో నిర్మించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్లాంట్ పూర్తి చేసారు. దాదాపు 1,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ ఇటీవలె నిర్మాణం పూర్తి చేసుకుంది. ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసే నాటికి 400 మందికి కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయి.పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనులు కాంగ్రెస్ పదినెలల్లో చేసి చూపెట్టిందని అన్నారు. బీఆర్ఎస్ సరిగా పాలన చేసి ఉంటే రైతు రుణమాఫీ చేయాల్సి వచ్చేదా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రూ.11 వేల కోట్ల రుణమాఫీకి కేసీఆర్ ఐదేళ్లు తీసుకున్నారని కానీ తమ ప్రభుత్వం 25 రోజుల్లోనే 23 లక్షల కుటుంబాలుకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రుణమాఫీని అభినందించాల్సింది పోయి విమర్శిస్తారా అంటూ దుయ్యబట్టారు.
Last Updated : 5 hours ago