బీఆర్ఎస్ను 100 మీటర్ల బొంద తీసి పాతిపెడతా - సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు - బీఆర్ఎస్ పై మండిపడ్డ రేవంత్
Published : Jan 20, 2024, 1:51 PM IST
CM Revanth Reddy Fires on BRS in London : లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. లండన్‌లో ప్రవాసులు ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ప్రసంగిస్తూ, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నిషాన్ లేకుండా చేస్తానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు లేకుండా వంద మీటర్ల బొంద తీసి పాతిపెడతానని ఘాటుగా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా, అహంకారం మాత్రం తగ్గలేదని దుయ్యబట్టారు.
CM Revanth Reddy London Tour : రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికార, విపక్ష నేతల మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి లండన్‌లో బీఆర్ఎస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నారు. మూడు రోజుల పాటు దావోస్‌లోని 54వ ఆర్థిక సదస్సుకు హాజరైన రేవంత్ రెడ్డి, అక్కడి నుంచి లండన్ వెళ్లారు.