LIVE : స్వగ్రామంలో దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్ - CM REVANTH ATTEND IN DUSSEHRA FEST
Published : Oct 12, 2024, 6:47 PM IST
|Updated : Oct 12, 2024, 7:06 PM IST
CM Revanth Attend Dussehra Celebrations in kondareddypally : సీఎం రేవంత్ రెడ్డి తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో పర్యటిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లికి ఆయన చేరుకొన్నారు. దసరా పండుగ సందర్భంగా ఇవాళ ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన హైదరాబాద్ నుంచి కొండారెడ్డిపల్లి చేరుకున్నారు. ఆయన రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఏటా జరిగే దసరా పండుగ నాడు కొండారెడ్డిపల్లికి వస్తుంటారు. గ్రామస్థులతో కలిసి పండుగను అంగరంగవైభవంగా జరుపుకుంటారు. రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో గ్రామంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రూ.18 కోట్లతో భూగర్భ డ్రైనేజ్, అంతర్గత రోడ్ల నిర్మాణానికి ఫౌండేషన్ చేయనున్నారు. అలానే రూ.32 లక్షలతో నిర్మించే చిల్డ్రన్ పార్క్ ఓపెన్ జిమ్‌కు శంకుస్థాపన జరపనున్నారు. రూ.55 లక్షలతో నిర్మించిన యాదయ్య స్మారక గ్రంథాలయం, రూ.64 లక్షలతో బస్టాండ్ సెంట్రల్ లైటింగ్ పనులకు శ్రీకారం చేయనున్నారు. రూ.70 లక్షలతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ హాల్ ప్రహరీ ప్రారంభం సహా రూ.18 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
Last Updated : Oct 12, 2024, 7:06 PM IST