LIVE : ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు - హాజరైన సీఎం రేవంత్ రెడ్డి - CM ATTENDS CHRISTMAS CELEBRATIONS
Published : Dec 21, 2024, 7:14 PM IST
|Updated : Dec 21, 2024, 7:54 PM IST
CM Attends Christmas celebrations Live : రాష్ట్రంలో క్రిస్మస్ సందడి మొదలైంది. ఊరువాడా క్రిస్మస్ స్టార్స్ వెలిగిపోతున్నాయి. షాపింగ్ మాల్స్ కిక్కిరిసిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ ఎల్బీ స్టేడియంలో క్రీస్తు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలకు రాష్ట్రంలోని ప్రముఖ చర్చ్‌ల ఫాదర్లు, మత పెద్దలు హాజరయ్యారు. వేలాది మంది క్రిస్టియన్ సోదరులు ఈ వేడుకలో పాలుపంచుకుంటున్నారు. వేడుక సందర్భంగా ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. స్టేడియం పరిసరాల్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు, పరిసరాల్లో ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ ఎక్కువగా నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. సీఎం రాక సందర్భంగా భద్రతా పరంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం..
Last Updated : Dec 21, 2024, 7:54 PM IST