LIVE : రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ భూమిపూజ - CM Revanth in Alwal Live
Published : Mar 7, 2024, 1:34 PM IST
|Updated : Mar 7, 2024, 1:53 PM IST
CM Revanth Live : ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ విధానమని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తామని చెప్పింది. తమ సర్కార్ పెట్టుబడులు, అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అన్నింటిని నేరవేరుస్తామని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతామని వివరించింది. తాజాగా సికింద్రాబాద్ ప్రాంత వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. కరీంనగర్ వైపు వెళ్లే ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సదుపాయం కలగనుంది. ఈ రూట్‌లో భారీ ఎలివేటేడ్ కారిడార్ నిర్మానాణికి ప్రభుత్వం సిద్ధమైంది. నేడు అల్వాల్‌లోని టిమ్స్ సమీపంలో ఏర్పాటు చేసిన భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని భూమి పూజ చేశారు. 11.3 కిలోమీటర్ల పొడవు మేర 6 లేన్లతో ఈ కారిడార్‌ను నిర్మించనున్నారు. దీంతో హైదరాబాద్–రామగుండం రహదారికి మహర్దశ పట్టనుందని నగరవాసులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంత వాసులు కరీంనగర్ వైపు వెళ్లే ప్రయాణికులు సాఫీగా ప్రయాణించవచ్చు.
Last Updated : Mar 7, 2024, 1:53 PM IST