ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మూడోరోజు పర్యటన - ప్రత్యక్ష ప్రసారం - CM CHANDRABABU VISIT FLOOD AREAS - CM CHANDRABABU VISIT FLOOD AREAS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 5:31 PM IST

Updated : Sep 3, 2024, 6:47 PM IST

LIVE : విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఆదివారం నుంచి ముంపు ప్రాంతాల్లో విశ్రాంతి లేకుండా నిర్విరామంగా సీఎం పర్యటిస్తున్నారు. సింగ్​నగర్, యనమలకుదురు, పటమట, రామలింగేశ్వర నగర్‌, జక్కంపూడి, భవానీపురం తదితర ప్రాంతాల్లో సీఎం పర్యటించి బాధితులతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లోనూ పర్యటించారు.  బోట్ల ద్వారా బయటకు వచ్చిన బాధితులతో మాట్లాడారు. వృద్ధులు, దివ్యాంగులను అంబులెన్స్‌లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మూడురోజులు పడిన కష్టాలను సీఎంకు చెప్పారు. ఇప్పటికీ కొంతమంది జలదిగ్బంధంలోనే ఉన్నారని బాధితులు తెలిపారు. వాహనం వెళ్లగలిగినంత దూరం అందులో మిగిలిన చోట్ల కాలినడక వెళ్లారు. కొన్నిచోట్ల మోకాలి లోతు నీటిలోనూ నడుచుకుంటూ వెళ్లారు. మరింత ఎక్కువ నీరు ఉన్న ప్రాంతాల్లో బోటు ద్వారా బాధితుల వద్దకు చేరుకుని వారితో స్వయంగా మాట్లాడి కష్టాలు తెలుసుకున్నారు. బాధితులు చెప్పే ఫిర్యాదుల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఆదుకుంటుందని ధైర్యంగా ఉండాలంటూ ప్రజల్లో భరోసా కల్పించారు.
Last Updated : Sep 3, 2024, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details